23-04-2025 09:56:14 PM
బెల్లంపల్లి అర్బన్: రైతులు భూ సమస్యలకు కావు లేకుండా ప్రభుత్వం భూభారతీనీ ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో రైతు వేదికలో బుధవారం భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరై మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించడంలో భూభారతి కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. భూ భారతి ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు తగినంత అవగాహన అవసరమన్నారు. అందుకోసమే అవగాహన సదస్సులు జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ మోతిలాల్, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, కాసిపేట తహసిల్దార్ భోజన్న, వ్యవసాయ అధికారులు, కాసిపేట కాంగ్రెస్ అధ్యక్షుడు రత్నం ప్రదీప, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.