calender_icon.png 15 October, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి పెండింగ్ దరఖాస్తులు త్వరితగతిన పూర్తి చేయాలి

15-10-2025 12:47:34 AM

కలెక్టర్ కె.హైమావతి 

సిద్దిపేట కలెక్టరేట్,అక్టోబర్ 14: మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో  భూ భారతి పెండింగ్ దరఖాస్తుల డిస్పోజల్ ప్రక్రియ గూర్చి ఆర్డీవో, తహసిల్దార్ ఇతర రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి  జూమ్ సమావేశం సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అప్లికేషన్ ప్రక్రియలో మిస్సింగ్ సర్వే నంబర్, పెండింగ్ మ్యుటేషన్, సక్షేషన్,డిఎస్,ఫీల్ ఎంక్వైరీ, చేంజ్ ఆఫ్ నేమ్,నేచర్, ఎక్స్టెండ్ కరెక్షన్,నేషన్ ఖాతా, పిఓబి,సాదా బైనమా ఇతరత్రా అప్లికేషన్ లు తహసీల్దార్, ఆర్డీఓ,ఏసి రెవెన్యూ లాగిన్ లో ఉన్న పెండింగ్ అప్లికేషన్ లు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చూసుకోవాలని సూచించారు. భూ భారతి చట్టం లోని మార్గదర్శకాల ప్రకారమే అప్లికేషన్ డిస్పోసల్ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను  ఆదేశించారు.