15-10-2025 12:47:51 AM
గాంధారి, అక్టోబర్ 14 (విజయక్రాంతి) ః గాంధారి మండల కేంద్రానికి చెందిన యువకుడు గుండెపోటుతో మరణించిన సంఘటన గాంధారి మండల కేంద్రంలో చోటు చేసుకుంది గాంధారి మండల కేంద్రానికి చెందిన సామ సుధీర్ (31) గుండెపోటుతో మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు.
అతను ఎప్పట్లాగానే ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేస్తుండగా ఒకసారి ఇంట్లోనే కుప్పకూలిపోవడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు వృత్తి రీత్యా న్యాయవాది విద్యను అభ్యసించి మండలంలో డాక్యుమెంట్ తయారీ రంగంలో పనిచేస్తున్నారు. అతనికి భార్య,ఆరు నెలల బాబు,తల్లి కలరు. గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.