calender_icon.png 9 May, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధార్ తరహాలో రైతులకు భూధార్‌కార్డు

09-05-2025 12:00:00 AM

-అందుబాటులో ప్రత్యేక యాప్ 

-పీఎం కిసాన్ సన్మాన్‌కు ఈ కార్డు తప్పనిసరి 

-రైతు సమగ్ర సమాచారం ఒకే చోట 

-రైతుల వద్ద వివరాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు

వనపర్తి, మే 8  ( విజయక్రాంతి )  :  రైతులకు సంబంధించిన సమాచారం ఆన్లైన్లో పొందుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలను తీసుకుంటుంది.  అందులో భాగంగానే ప్రతి రైతుకు ఆధార్ తరహాలో  గుర్తింపు కార్డు ఇచ్చేలా   11 నెంబర్లతో కూడిన ప్రత్యేకంగా రూపొందించిన భూదార్ కార్డును ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే భూదార్ కార్డుల జారీకి అవసరమైన వివరాల సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఏ ఈ ఓ లకు  సూచనలు చేశారు 

 ఈ ఫార్మసీ రిజిస్ట్రీ ...

 వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిటిట లైజేషన్ చేయాలని ఉద్దేశంతో  ప్రతి రైతు కు విశిష్ట సంఖ్య జారీ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ని రూపొందించాలని  కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అగ్రి స్టాక్ ప్రాజెక్టు పేరిట అమలు చేయబోతున్న  ఈ ప్రాజెక్టు కోసం స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్  ( ఎస్ పి ఎం యు ) ఏర్పాటుచేసి  వెబ్ ల్యాండ్ డాటా ఆధారంగా జిల్లాలో మండలాలు గ్రామాల వారిగా రైతులు ఈ ఫార్మసీ రిజిస్ట్రీ ను రూపొందిస్తారు 

పట్టాదారు పాసు పుస్తకం కలిగిన ప్రతి రైతుకు భూధార్ కార్డు...

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్న ప్రతి రైతుకు  ఈ ఫార్మసీ రిజిస్ట్రీ పూర్తిచేసి భూ ధార్ కార్డు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఆ గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులను చేపట్టి రైతులకు భూధార్ కార్డు అవగాహన కల్పించనున్నారు.

అవగాహన కార్యక్రమంలో ప్రధానంగా రికార్డుల ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వ్యవసాయ శాఖ అధికారులు వివరించి ఈ కార్డులు ఉంటేనే ఇక నుంచి పీఎం కిసాన్ డబ్బులను రైతులు పొందగలుగుతారని  రైతుకు సంబంధించిన ప్రతి వివరాలు కాగితాలు లేకుండా ఆన్లైన్లో చూసుకోవడానికి కార్డు నెంబర్ ఉపయోగపడుతుందని అవగాహన కల్పిస్తున్నారు. 

రైతుల పూర్తి సమాచారం ఒకే చోట..

రైతులకు సంబంధించిన సమగ్ర వివరాలను ఒకే చోట ఉండేలా నూతన విధానానికి కేంద్ర ప్రభుత్వం భూదార్ కార్డులు ప్రవేశపెట్టనుంది. ఆధార్ కార్డు తరహాలో ప్రతి రైతుకు ఓదార్ కార్డు గుర్తుకు ఇవ్వాలని 11 అంకెలతో కూడిన విశిష్ట సంఖ్యను కేటాయించనున్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్  చేయనున్నారు.

గత నెల ఏప్రిల్ లో హైదరాబాదులోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో  అధికారులకు శిక్షణ ఇచ్చారు. రైతులకు కేటాయించిన భూధార్ కార్డు నెంబరు క్లిక్ చేస్తే చాలు రైతు పేరు ఇతర వివరాలు,  సర్వే నెంబర్లు,   భూమి ఏ ప్రాంతంలో ఎంత ఉంది ఆ భూమి ఏ పంటలకు అనువైనది  వంటి వివరాలు తెలుస్తాయి.

వీటితోపాటు సబ్సిడీ వ్యవసాయ పరికరాలు,   రసాయన ఎరువులతో పాటు పీఎం సమ్మాన్ నిధి , పంట నష్టపరిహారం తదితర వివరాలను పొందుపరుచునున్నారు.  బ్యాంకులో రుణం కోసం పట్టా పాస్ బుక్ ఇతర పత్రాలను రైతు అధికారులు చూపించాల్సిన అవసరం లేకుండా కేవలం రైతుకు కేటాయించిన 11 అంకెల నెంబర్ గల కార్డు సదరు బ్యాంక్ అధికారికి చెప్తే సరిపోతుంది. 

జిల్లాలో మండలాల వారీగా రైతుల వివరాలు ..

సంఖ్య మండలం పేరు రైతులు 

1. అమరచింత 7980

2. ఆత్మకూరు 11472

3. కొత్తకోట 18425

4. మదనాపురం 10130

5. చిన్నంబావి 11685

6. పాన్ గల్ 19757

7. వీపనగండ్ల 12338

8. ఘనపురం 16126

9. గోపాల్ పేట 13267

10. పెబ్బేరు 15216

11. పెద్ద మందడి 15899

12. రేవల్లి 5740

13. శ్రీ రంగాపురం 8153

14. వనపర్తి 19798

15 ఎదుల 8764

మొత్తం  194750  రైతులకు భూ ధార్ కార్డులు అందేలా అధికారులు చర్యలను చేపడుతున్నారు