09-05-2025 02:44:56 AM
జై జవాన్
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): ‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత సార్వభౌమత్వం మీద దాడిచేయాలని చూసే వారికి ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లే.. పాక్ ఉగ్రవాదులు, పాక్ పాలకులు.. అంతర్జాతీయ ముఖచిత్రంలో ఉన్న ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి.. భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఈ భూమ్మీద మీరు నివసించేందుకు అర్హత కోల్పోయినట్లే.. ’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
‘మేం శాంతికాముకులం.. అది మాచేతగానితనం అనుకుని మా ఆడబిడ్డల నుదిటి సిందూరాన్ని తుడిచివేయాలనుకుంటే..ఆపరేషన్ సిందూరే మీకు సమాధానం’ అని సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాం..భిన్న సిద్ధాం తాలు ఉండొచ్చు..మిగతా సమయాల్లో మేమంతా ఒక్కటే..అందరం భారతీయు లం..’ అని వ్యాఖ్యానించారు.
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతుగా, ఉగ్రమూకలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయం త్రం సచివాలయం నుంచి నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, పార్టీనాయకులు, యువత భారీగా పాల్గొన్నారు.
పహల్గాం మృతులకు రెండు నిమిషాలు మౌనం పా టించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో కేంద్రానికి, సైన్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ కూడా ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఉగ్రవాదులను అణిచివే సేందుకు ఏ చర్య తీసుకున్నా సంపూర్ణ మద్ద తు ఉంటుందని ప్రకటించారని, ఇదీ భారతీయుల స్ఫూర్తి అని అన్నారు. జవాన్లకు అండగా నిలిచేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, దేశ రక్షణ విషయంలో తామందరం ఒక్కటేనని తెలంగాణ గడ్డ నుంచి భారత జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే ఈ సంఘీభావ ర్యాలీ అని ప్రకటించారు.
పాకిస్థాన్ వక్రబుద్ధి మానుకోవాలి..
ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులకు మన సైన్యం గట్టి సమాధానం ఇచ్చిందని సీఎం రేవంత్ కొనియాడారు. ‘మాకు బలం, బలగం రెండు ఉన్నా..సంయమనం పాటిస్తున్నాం..మరోసారి ఇది రిపీట్ అయితే పరిస్థితి వేరేలా ఉంటుందనే విషయం పాకిస్తాన్ తెలుసుకోవాలి’ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూ స్తే సహించేది లేదన్నారు. ఇకనైనా పాకిస్థాన్ వక్రబుద్ధిని మానుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు.
ఉగ్రవాద చర్యలను ఎవరూ ఉపేక్షించరని తెలిపారు. రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, అత్యవసర సేవలకు ఎలాం టి ఆటంకం కలగనీయవద్దన్నారు. హైదరాబాద్‌లో రక్షణరంగ సంస్థల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
పాక్‌ను నేలమట్టం చేసే శక్తి ఉంది..
బ్రిటిష్‌వాళ్ల నుంచి శాంతి ద్వారానే భారత్‌తోపాటు పాకిస్థాన్ కూడా స్వేచ్ఛావాయు వులు అందించి మహాత్మాగాంధీ అమరుడు అయ్యారని, ఆయన ఇచ్చిన, చేసిన శాంతియుత పోరాటం వల్లే మనం ఈ రోజు స్వే చ్ఛను అనుభవిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన శాంతి సిద్ధాం తాన్ని పుణికిపుచ్చుకున్న భారతీయులు శాం తిని కోరుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడుస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
‘మా శాంతి, ఆకాంక్షను చేత గానితనంగా భావించవద్దు.. ఆపరేషన్ సిం దూర్ ద్వారానే మిమ్ములను నేలమట్టం చేసే శక్తి మా వీర జవాన్లకు ఉంది.. ఆ వీర జవాన్‌లకు 140 కోట్ల భారతీయులు అండగా నిలబడుతారు..ఈ ర్యాలీ ద్వారా సందేశం ఇవ్వదలుచుకున్నాం..’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.