calender_icon.png 9 May, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంకెపల్లిలో ఎన్‌కౌంటర్

09-05-2025 02:40:07 AM

8 మంది మావోయిస్టులు మృతి!

  1. వారంతా అగ్రనాయకులే?
  2. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, ఎస్‌జెడ్‌సీఎం ప్రకాశ్ 

చర్ల, మే 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూరు బ్లాక్ లంకెపల్లి అడవుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. అందులో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తున్నది. ములుగు జిల్లా వాజేడు మండలంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలి ముగ్గురు జవాన్లు మృతిచెందడంతో.. భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని తెలి సింది.

ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, ఎస్‌జెడ్‌సీఎం బండి ప్రకాష్ సహా మొత్తం 8 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో బాంబుల మోత వినిపించినట్టు సమాచారం. ఎన్‌కౌంటర్ సమాచారం పోలీసులు ధ్రువీకరంచలేదు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. ఈ ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘా లు కూడా ఆరా తీస్తున్నాయి. కాగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న ఆ పార్టీలో చాలా కీలకమైన నేతగా ఉన్నారు.

తెలంగాణలో మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. కర్రెగుట్టల్లో చంద్రన్న ఆధ్వర్యంలోనే ఆపరే షన్ అంతా కొనసాగినట్లు తెలుస్తోంది. చంద్రన్న తలపై రూ.కోటి రివార్డు కూడా ఉన్నది. కాగా ఆపరేషన్ కగార్‌కు, తెలంగాణకు ఎటు వంటి సంబంధం లేదని ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ నేత లు, మంత్రి సీతక్క చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్ తెలంగాణ పోలీసులకు తెలిసి జరిగిందా లేదంటే కేంద్ర భద్రతా బలగాల ఆధ్వర్యంలో జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.