calender_icon.png 25 January, 2026 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ సిటిజన్స్ కు సన్మానం చేసిన భూమేష్ కుమార్

25-01-2026 07:09:53 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజ్ పల్లి గ్రామంలో సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయఓటరు దినోత్సవం  సందర్భంగా ఆదివారం సీనియర్సిటిజన్స్ దాసరి నారాయణ రెడ్డి, దాసరి బక్కారెడ్డి , ఎర్రం రాంరెడ్డి, కల్వలభీమయ్య  నలుగురికి  సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్  మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓటర్ల భాగస్వామ్యం, ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

గ్రామంలోనీ  ప్రతి  పౌరుడికి గల అమూల్యమైన హక్కు అందుకే మీ ఓటు మీ భద్రత- మీ బాధ్యత- మీ ఓటు మీ హక్కు- మీ వాక్కు- మీ ఓటు అవినీతిపై వేటు - అభివృద్ధికి చోటు - మీ ఓటు చూపుడు వేలితో తలరాతను మారుస్తుందని అవగాహన కల్పించడం జరిగిందన్నారు,  ఓటర్లతో  ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాసరి మధుసూదన్  రెడ్డి, జిపిఓ సృజన, వార్డ్ మెంబర్ న్యాతరి అరవింద్, బి ఎల్ ఓ  శ్రీ లత,మాధవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.