25-01-2026 07:05:43 PM
జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి,(విజయక్రాంతి): ఓటరుగా అర్వత పొందిన ప్రతి ఒక్కరు ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా రెవిన్యూ ఆధనం కలెక్టర్ విక్టర్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు. 18 సంవత్సరాల నిండిన యువతను అధికారికంగా హోటల్గా నమోదు చేసుకున్న ఉద్దేశంతో వారి లెటర్స్ ఫోటో ఐడెంటి కార్డులు పదిమందికి పంపిణీ చేశారు.
జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఏపీ కాళ్లు పంపించడంతోపాటు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. అనంతరం ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీవో వీణ, తాసిల్దార్ జనార్ధన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.