06-08-2025 04:57:59 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూర్ మండల(Tandur Mandal) పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను అధికారులు, నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనునిత్యం పరితపించి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు సిరంగిశంకర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పుట్ట శ్రీనివాస్, నాయకులు కొండ గొర్ల అంజి, సంతోష్, మాణిక్ రావు, విజయ్, శ్రీనివాస్, షేక్ అహ్మద్, పర్పత్ రావు పాల్గొన్నారు.