calender_icon.png 6 August, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు కృషి

06-08-2025 05:05:51 PM

తహసీల్దార్ ఎండి.ముజీబ్..

బిచ్కుంద (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రూప కర్త, ఉద్యమ కెరటం, మేధావి ఆచార్య "కొత్తపల్లి జయశంకర్ జయంతిని బుధవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం డి.ముజీబ్(Tahsildar M.D.Mujeeb) మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నీళ్లు-నిధులు నియామకాలు వాటి ప్రాదాన్యత గురించి అర్థం చేయించిన మేధావి ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్ లు శివ రామకృష్ణ, శరత్, గిర్దవార్ ఏం శంకర్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.