calender_icon.png 6 August, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి పాలు ఎంతో శ్రేష్టమైనవి

06-08-2025 05:25:19 PM

కుభీర్: చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు గాను తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎంఎల్ హెచ్ పి విద్యా శ్రీ సూచించారు. బుధువారం నిర్మల్ జిల్లా(Nirmal District) కుభీర్ మండలంలోని సిర్పెల్లి పల్లె దవాఖానాలో తల్లి పాల వారోత్సవాలలో భాగంగా గిరిజన తండాల్లోని అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలు, గ్రామంలోని మహిళలకు తల్లిపాల ప్రముఖ్యతపై దవాఖానా ఎంఎల్ హెచ్ పి లు అవగాహన కల్పించారు. తల్లి పాలల్లో గల పోషకాల గురించి వివరించారు.

ఆకుకూరలు, పాలు, పండ్లు, గుడ్లు, తృణ ధాన్యాల విశిష్టతపై అవగాహన కల్పించారు. వివిధ రకాల తృణ ధాన్యాలు, ఆకుకూరలు, పండ్లను ప్రదర్శించి వాటిపై వివరించారు. అనంతరం ఎన్డిడి ఒరియంటేషన్ లో బాగంగా నట్టల నివారణ పై వివరించారు.ఈ కార్యక్రమం లో సీనియర్ ఏ ఎన్ ఎం కే. మంగమణి, ఏ డబ్ల్యూ టీ శోభ, ఆశ కార్యకర్త కాంత, పిఎస్ హెచ్ఎం నాగమణి, మహిళలు పాల్గొన్నారు.