06-08-2025 05:17:02 PM
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్..
దేవరకొండ: ప్రతి ఒక్కరు వేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్(Former MLA Ramavath Ravindra Kumar) అన్నారు. బుధవారం కొండమల్లెపల్లి మండలం గౌరికుంట తండాలో వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు రమావత్ తులిసిరం, మాజీ సర్పంచ్ రమావత్ దీప్ల నాయక్, రమావత్ రమేష్,రమావత్ కృష్ణ,పెద్దిశెట్టి సత్యం, వెంకటయ్య,శివ తదితరులు పాల్గొన్నారు.