06-08-2025 05:47:22 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సాగీయ ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తిదాత అని బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి(BRS District Coordinator Ramakrishna Reddy) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ కన్వీనర్ మార్గొండ రాము ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి తొలి మల్లి దశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటం ఇప్పటికీ మర్చిపోలేము అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ యూ సుభాష్ రావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, జీవన్ రెడ్డీ, Ex జడ్పీటీసీ సోన్ మండల్, గండ్రత్ రమేష్, ఖాజా అక్రమ్ అలీ,ఉద్యమ కారుడు, నజీరుద్దీన్, మాసూద్ అలీఖాన్, చారి, శేఖర్ గౌడ్,రిజ్వాన్ ఖాన్, మొహమ్మద్ నయీమ్, షైక్ మహేబూబ్, జుబైర్ ఖాన్, మొహమ్మద్ బిన్ అలీ, అజిజ్, ఖలీల్, బబ్లు, షౌకత్, విశాల్ తదితరులు ఉన్నారు.