calender_icon.png 6 August, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే చేతుల మీదుగా డయాగ్నిక్ సెంటర్ ప్రారంభం

06-08-2025 05:09:09 PM

సదాశివపేట (విజయక్రాంతి): సదాశివపేటలో ఎలైట్ డయాగ్నిక్ సెంటర్(Elite Diagnostic Center)ను ఎమ్మెల్యే చింత ప్రభాకర్(MLA Chinta Prabhakar) ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ... వైద్యం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లకుండా మన సదాశివపేటలోనే ఆధునికమైన పరికరాలతో ఏర్పాటు చేసిన కిరణ్ గౌడ్ భావనలను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రశంసించడం జరిగింది. పేదవారికి తక్కువ ధరకే వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అనంతరం ఎలైట్ డయాగ్నస్టిక్స్ నిర్వాహకులు కిరణ్ గౌడ్ భావనలు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు శాలువా వేసి పూలమాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింత సాయినాథ్, కాసాల బుచ్చిరెడ్డి, రాములు గౌడ్, సుధీర్ రెడ్డి, పెద్ద గొల్ల ఆంజనేయులు, భాస్కర్ గౌడ్, భరత్ గౌడ్, వీరేశం, మోబిన్, బరాడి శివ తదితరులు పాల్గొన్నారు.