06-08-2025 05:36:40 PM
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్పెషల్ ఆఫీసర్ వసుంధర దేవి..
చిట్యాల (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, కళాశాల లెక్చరర్లు అడ్మిషన్లను పెంపొందించేందుకు కృషి చేయాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్పెషల్ ఆఫీసర్ వసుంధర దేవి(Board of Intermediate Special Officer Vasundhara Devi) అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను పర్యవేక్షణ నిమిత్తం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు ప్రభుత్వ విద్య పట్ల పలు సూచనలు సలహాలు అందజేశారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా శ్రద్ధతో చదువుకోవాలన్నారు. కళాశాలలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బి.శ్రీదేవి, కళాశాల లెక్చరర్లు బాలకృష్ణ, యుగేందర్, నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.