calender_icon.png 6 August, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ క్రైమ్, నార్కోటిక్ డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన

06-08-2025 05:14:28 PM

బెల్లంపల్లి రూరల్ సీఐ అనోక్..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విద్యార్థులకు సైబర్ క్రైమ్, నార్కోటిక్ డ్రగ్స్ పై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. బుధవారం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బెల్లంపల్లి రూరల్ సీఐ అనోక్(CI Anok) సైబర్ క్రైమ్,  నార్కోటిక్ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది, సైబర్ క్రైమ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రతల గురించి వివరించారు. వాట్సాప్ ఫేస్బుక్, ఆన్లైన్లో వచ్చే లింక్స్ ను క్లిక్ చేయొద్దని కోరారు.

లాటరి వచ్చిందని, అకౌంట్ బ్లాక్ అవుతుందని, KYC అప్డేట్ చేయాలనీ మెసేజెస్ కి రెస్పాండ్ కావద్దని తెలిపారు. సైబర్ క్రైమ్ కి గురి అయితే తీసుకోవాల్సిన జాగ్రతల గురించి ఆయన ప్రత్యేకంగా వివరించారు. అలాగే గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఉద్బోధించారు. కార్యక్రమంలో ఆల గురజాల ఎస్సై రామకృష్ణ, కాంపల్ శంకర్, విద్యార్థులు పాల్గొన్నారు.