calender_icon.png 16 November, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ ఫలితాలు అందరికీ పాఠం

16-11-2025 12:00:00 AM

-ఇండియా కూటమి ఎంతో నేర్చుకోవాలి

-కొత్త రాజకీయ సవాళ్లకు వ్యూహాత్మక ప్రణాళిక

-ఈసీపై ఆరోపణలు కొట్టిపారేయలేం

-తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

చెన్నై, నవంబర్ 15: బీహార్ ఎన్నికల ఫలితాలు అందరికీ పాఠమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఈ ఫలితంతో ఇండియా కూటమి ఎంతో నేర్చుకోవాలని తెలిపారు. ఈ మేరకు సీఎం స్టాలిన్ ఎక్స్‌లో శనివారం పోస్టు చేశారు. అద్భుతమైన విజయం సాధించిన సీఎం నితీశ్‌కుమార్‌కు, ఎన్నికల్లో గెలుపు కోసం నిర్విరామంగా పోరాడిన ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సంక్షేమా లు, సామాజిక, సైధాంతిక సంకీర్ణాలు, స్థిరమైన ప్రచారంపై ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. ఇండియా కూటమిలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఉన్నారని, భవిష్యత్ రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక ప్రణాలిక వేసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ తీరుపై ఆయన అనేక ఆరో పణలు చేశారు. ఈ ఫలితంలో ఈసీపై వచ్చి న ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించారు.

ఈసీ ప్రతిష్ట క్షీణించిందన్నారు. ఓడిపోయిన అభ్యర్థుల్లో కూడా నమ్మకం కలిగించేలా ఎన్నికల సంఘం ఉం డాలని పేర్కొన్నారు. బీహార్‌లో రెండు దశ ల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఇందులో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 245 సీట్లకు 202 సీట్లను గెలుచుకొంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్బంధన్ కేవలం 34 సీట్లకే పరిమితమైంది.