calender_icon.png 16 November, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓడినా ఓటుషేర్‌లో ఆర్జేడీనే టాప్!

16-11-2025 12:00:00 AM

-బీజేపీ, జేడీయూకంటే ఎక్కువ ఓట్లు

-ఈ సారి 23.11 శాతం ఓట్లు

పాట్న, నవంబర్ 15: బీహార్ ఎన్నికల ఫలితాల్లో తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీకి బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ శాతం ఓట్లు సాధించి, టాప్‌లో నిలిచింది. కానీ ఘోర ఓటమి పొందింది. ఆర్జేడీ పోటీ చేసిన 143 సీట్లలో 25 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 23% ఓట్లు సాధించింది.

ఒకే పార్టీ ఎన్నికల్లో సాధించిన అత్యధిక ఓట్లు ఇవే. ఈ ఓట్లు బీజేపీ, జేడీ(యూ)కు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. 2020 ఎన్నికలలో 75 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ ఈ సారి సాధించిన 23.11% ఓట్లతో పోలిస్తే 2025లో స్వల్పంగా తగ్గింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోరంగా ఓడిపోయినా,  కేవలం 25 సీట్లు మాత్రమే సాధించినా కానీ తేజస్వి యాదవ్‌కు భారీ ఓటింగ్ శాతం నమోదైంది. లాలూ ప్రసాద్ యాదవ్ వారసత్వాన్ని ఉనికిపుచుకున్న తేజస్వి, భారీ సంఖ్యలో జనాలను ఆకర్షించారు. ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకు న్నారు.

అయినా ఎన్నికల్లో ఓడిపోయింది.  బీజేపీ, జేడీ(యూ) కంటే ఎక్కువ ఓట్లు సాధించిన ఆర్జేడీకి బీహార్ ప్రజలలో భారీ ఆదరణ ఉందని నిరూపించు కుంది. ఘోర ఓటమిని చవిచూసిన ఆర్జేడీ భారీ ఓటింగ్‌శాతం రాబట్టడంతో విజయం సాధించింది. 2025 అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 1.15 కోట్ల (1,15,46,055) మంది ఆర్జేడీ అభ్యర్థులకు ఓటు వేశారు. అయితే ఈ ఎన్నికల్లో 89 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి మాత్రం 20.08% ఓట్లను సాధించింది.

ది ఆ పార్టీ 2020లో సాధించిన 19.46% కంటే ఎక్కువ. 1,00,81,143 మంది బీజేపీకి ఓటు వేశారు. బీజేపీ మిత్రపక్షమైన నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) పోటీ చేసిన 101 సీట్లలో 85 సీట్లను గెలుచుకుంది. ఈ పార్టీకి 19.25% (96,67,118) ఓట్లు వచ్చాయి.  ఈ పార్టీ ఓట్ల శాతం భారీగా పెరిగింది. ఈ పార్టీకి 2020లో 15.39% నుంచి ఈసారి 19.25%కి ఓటింగ్ పెరిగింది.

దీంతో నితీష్ కుమార్, సంవత్సరాల తరబడి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నా, తన రాజకీయ వైఫల్యాలను ఎగతాళి చేసినప్పటికీ ఈ సారి పెరిగిన ఓట్ల శాతం అతని రాజకీయ చతురతను బలపరుస్తోంది. చిరాగ్ పాస్వా న్, లోక్ జనశక్తి పార్టీ, హిందుస్తానీ అవామ్ మోర్చా(లౌకిక), రాష్ట్రీయ లోక్ మోర్చా కలిపి ఎన్డీఏ కూటమికి మొత్తం ఓట్ల శాతం 46-.47% వరకు ఉంది. ఇక్కడే ఆర్జేడీని దాని మహాఘట్బంధన్ మిత్రపక్షాలు -కాంగ్రెస్, వీఐపీ, వామపక్షాలు నిరాశపరిచాయి.

మహాఘట్బంధన్ 35.89% ఓట్లను పొం దింది. తేజస్వీ పార్టీ ఈసారి బీజేపీ లేదా జేడీ(యూ) కంటే ఎక్కువ ఓట్ల శాతాన్ని పొందడానికి కారణం అది పోటీ చేసిన సీట్ల సంఖ్య. ఈసారి ఆర్జేడీ తన అభ్యర్థులను 143 స్థానాల్లో నిలబెట్టింది. మరోవైపు, బీజేపీ, జేడీ(యూ) ఈసారి చెరో 101 స్థానాల్లో పోటీ పడ్డాయి. బీజేపీ, జేడీ(యూ) కంటే ఆర్జేడీ 42 స్థానాల్లో ఎక్కువగా పోటీచేసింది. దీంతో ఎక్కువ ఓట్లను సాధించింది. ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఓట్ల శాతం పెంచుకున్నారు.