calender_icon.png 16 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముకమామిడిలో ఏకలవ్య విద్యాలయం

16-11-2025 12:42:15 AM

  1. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ

హాజరైన ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ

ములకలపల్లి, నవంబర్ 15 (విజయక్రాం తి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ముకమామిడి గ్రామంలోనిర్మించి న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు.గిరిజన విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది కీలక భాగమని ప్రధాని పేర్కొన్నారు.

ఈ సందర్భం గా పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహా యం రఘురాం రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మె ల్యే జారే ఆదినారాయణ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల గిరిజన ప్రాంతానికి విద్యా పరంగా పెద్ద వరమని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ గిరిజన ప్రాంతాల అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యం గా పరిగణిస్తున్నారని, విద్య ద్వారా గిరిజన సమాజ అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటుందని చెప్పారు. ముకమామిడి గ్రామంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ ఏకలవ్య మోడల్ స్కూల్ గిరిజన విద్యార్థుల జీవితాల్లో కీలక మార్పులు తీసుకురాబోతోందన్నారు. కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, గిరిజన పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, రైతు సంఘ నాయకులు, ప్రజాప్రతిని ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.