08-09-2025 01:16:02 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లికి చెందిన కవి, రచయిత గోడిసెల శ్రీహరి మహా కవుల జయంతోత్సవంలో ప్రశంసలందుకున్నారు. హైద్రాబాద్ బిర్లా సైన్స్ మ్యూజియం భాస్కర అడిటోరియంలో మహాకవుల జయంతోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ కవి సమ్మేళనం మాతృధార కవితల సంకలనం పుస్తకాలను ప్రముఖ కవి రచయిత నంది సిద్ధారెడ్డి, నేటినిజం ఎడిటర్ కవి ఆవిష్కరించారు. ఇందులో ప్రధానంగా అమ్మ మీద రాసిన కవులకు పురస్కారాలు అందజేశారు. బెల్లంపల్లికి చెందిన కవి, రచయిత గొడిసెల శ్రీహరికి ప్రశంస పత్రం అందచేశారు. ఈ సందర్భంగా మాతృధార పుస్తకాన్ని కేంద్రాసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కవి రచయిత ఉమ మహేశ్వర్రావు, రిటైర్డ్ ఐ జి ఇక్బల్,కవి రచయిత పొట్లూరి హరికృష్ణ కలిసి అందచేసి సత్కరించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కవులు తమ కవితాలను వినిపించారు.