calender_icon.png 8 September, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి కోమటిరెడ్డిని కలిసి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

08-09-2025 01:18:48 PM

వలిగొండ (విజయక్రాంతి): రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy)ని సోమవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) పలు అభివృద్ధి పథకాల కోసం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు. భువనగిరి నుండి చిట్యాల వరకు గల రోడ్డు ప్రస్తుతం నేషనల్ హైవే పరిధిలో ఉన్నందున ఆర్ అండ్ బి పరిధిలోకి మార్చి హామ్ పథకం కింద నాలుగు లైన్ల రోడ్డుగా ప్రతిపాదించి పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కోరారు. అదేవిధంగా వలిగొండ మండలంలోని సంగెం గ్రామం పరిధిలోగల భీమలింగం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లను పిలిచి పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.