03-07-2025 12:00:00 AM
విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబు
పాలమూరు యూనివర్సిటీ జూలై 2 : పాలమూరు యూనివర్సిటీకి గురువారం తెలంగాణ విద్య కమిషన్ సభ్యులు విచ్చేస్తున్నట్లు రిజిస్ట్రార్ పూస రమేష్ అన్నారు.
బుధవారం పరిపాలన భవన్ యందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో రిజిస్ట్రార్ పూస రమేష్ మాట్లాడుతూ రేపు పీయూ కు మొట్టమొదటి సరిగా తెలంగాణ విద్యా కమిషన్ వస్తుందని, ముఖ్య అతిధులు గా కమిషన్ ఛైర్పర్సన్ ఆకునూరి మురళి , ఉపకులపతి ఆచార్య జి ఎన్ శ్రీనివాస్ రానున్నారని, గౌరవ అతిధిలు గా కమిషన్ సభ్యులు,ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, బోధన, బోధనే తర సిబ్బంది పాల్గొంటారని తెలిపారు..
పబ్లిక్ హియరింగ్ (ప్రజా విచారణ) లో విద్యా రంగం లో ప్రజాభిప్రాయాలను, అం చలానాలను, సూచనలను స్వీకరిస్తుందని, పాఠ్య ప్రణాళిక, బోధన లో లోపాలను వివి ధ వర్గాల నుంచి సేకరించి రిపోర్ట్ రూపం లో కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని అన్నారు. ఈ సమావేశం లో ప్రిన్సి పాల్స్ డా కరుణాకర్ రెడ్డి , డా రవికాంత్ ఉన్నారు.