19-11-2025 03:47:15 PM
చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ దగ్గర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూల మాలలేసి నివాళులర్పించారు. పండ్లు, స్వీట్లు పంచి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేనని సేవలు చేసి, దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి, భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.