calender_icon.png 19 November, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

19-11-2025 05:09:59 PM

కాటారం (విజయక్రాంతి): భారతదేశ మొదటి మహిళ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాటారం మండలం ధన్వాడ గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహేష్ గౌడ్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన మహనీయురాలని, దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల యూత్ అధ్యక్షులు మహేష్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొడిగె గిరీష్, చీకట్ల వెంకటేష్, తోట కిషోర్, బుర్రి సుధాకర్, పుట్ట రాజేందర్, రఘునందన్, కోడి రవికుమార్, కొండ్ర శివ, శ్రీకాంత్, చిటూరి రాజేష్, గణేష్, కొండ్ర శ్రీకాంత్, చింటూ, తదితరులు పాల్గొన్నారు.