19-11-2025 04:36:19 PM
- ప్రపంచం మొత్తం కమ్యూనిస్టు వైఫై ఆలోచన చేస్తుంది
- ఒక్క సీపీఐ కార్యకర్త వెయ్యి మందితో సమానం
బస్సు ప్రచార జాత కార్యక్రమంలో మాట్లాడిన
- సీపీఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మునుగోడు (విజయక్రాంతి): దేశంలో అనేక పోరాటాలతో త్యాగాలతో పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన నిలబడిన పార్టీ సీపీఐ అని నలగొండ జిల్లా సీపీఐ కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సీపీఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో నిర్వహించి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ.. 15న గద్వాల నుంచి ఖమ్మం వరకు కొనసాగుతున్న ప్రచార బస్సు జాత బుధవారం మునుగోడు మండలానికి చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం మరింత పెరగనుందని ప్రపంచం మొత్తం కమ్యూనిస్టుల నాయకత్వాన్ని కోరుకుంటుందని అన్నారు.
దేశంలో స్వాతంత్రం వచ్చాక పేద ప్రజలకు ప్రభుత్వ భూములను పంచాలని పోరాడిన ఏకైక పార్టీ సీపీఐ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన చట్టాల కోసం నిరంతరం సీపీఐ పోరాటాలు నిర్వహించిందని అన్నారు. రాష్ట్రంలో సాగునీరు ప్రాజెక్టుల కోసం సిపిఐ చేసిన అలుపెరుగని పోరాటాలతోనే సాగునీటి ప్రాజెక్టులు సాధించామని అన్నారు. దేశంలో నేడు నెలకొన్న పరిస్థితులలో కమ్యూనిస్టులు మరింత బలపడాలని వామపక్ష ప్రజాతంత్ర పూర్వగామి శక్తులు కోరుకుంటున్నారని తెలిపారు. నల్గొండ జిల్లాలో పిత్తందారులకు వ్యతిరేకంగా నిజాం సర్కార్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సీపీఐ సమరశీల పోరాటాలు చేసిందన్నారు. ఒక్కొక్క కమ్యూనిస్టు కార్యకర్త వెయ్యి మంది కార్యకర్తలతో సమానమని అన్నారు.
పత్తి కొనుగోళ్ల విషయంలో సీపీఐ కొనుగోళ్లలో ఎకరానికి 7 క్వింటాల కు పరిమితి చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శించారు. 26న ఖమ్మం జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, కార్మికులు కర్షకులు శ్రామికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కె శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజ రామచంద్రం, బుల్గురి నరసింహ, తీర్పారి వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి చాపల శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, గోస్కొండ లింగయ్య, బండమీది యాదయ్య, మందులపాండు, వనం వెంకన్న, ఉప్పునూతల రమేష్, కాగితం వెంకన్న, మాధగోని సత్తమ్మ, దుబ్బ వెంకన్న, ఈదులకంటి కైలాస్, బండారు శంకర్, కట్కూరి లింగస్వామి, చాపల విప్లవ్, ఉదయ్, గోపికూమార్, ఉదయ్ కుమార్ ,కట్ట దశరథ ,నందిపాటి అశోక్ సతీష్ ఉన్నారు.