calender_icon.png 19 November, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుస్తక ప్రదర్శన

19-11-2025 04:50:40 PM

మంచిర్యాల (విజయక్రాంతి): 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మంచిర్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల(TGSWRDC)లో బుధవారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలను వీక్షించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రామక పాండురంగ శర్మ ప్రదర్శనను ఉద్దేశించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల ప్రాధాన్యత గురించి వివరించి, విద్యార్థులు పఠనాసక్తిని  పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి సబ్జెక్టుపైన సమగ్రమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ ప్రదర్శనలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి అనూష, లైబ్రేరియన్ డాక్టర్ పద్మారాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.