calender_icon.png 19 November, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ చీరల పంపిణీ

19-11-2025 05:08:27 PM

చెన్నూర్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేటలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కార్మిక శాఖ మంత్రి గడ్డం వినోద్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎస్‌హెచ్‌జీ మహిళలకు చీరలను అందజేసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే పథకాలను అమలు చేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని సదుపాయాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళా సంఘాలు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.