calender_icon.png 19 November, 2025 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ

19-11-2025 04:45:03 PM

జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధు వంశీకృష్ణ 

చిట్యాల (విజయక్రాంతి): భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టి, నిరుపేదల అభ్యున్నతికి వెన్నుదన్నుగా నిలిచి, ఉక్కు మహిళగా పేరుగాంచారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధు వంశీకృష్ణ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధువంశీ కృష్ణ మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ అని అన్నారు.

నిరుపేదల ముంగిటకు బ్యాంకు సేవలను తీసుకువచ్చేందుకు బ్యాంకులను జాతీయం చేశారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి కార్యక్రమానికి ఇందిరాగాంధీ పథకాలు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిలుకల రాయకోమురు, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, మండల నాయకులు గుమ్మడి సత్యనారాయణ, అరెపెల్లి మల్లయ్య, అరెపల్లి నర్సింహా రాములు, ఆకుల రవీందర్, శనిగరపు మొగిలి యూత్ నాయకులు అల్లం రాజు, ఏకు కిషన్ తదితరులు పాల్గొన్నారు.