25-10-2025 06:39:02 PM
హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
అచ్చంపేట: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం అచ్చంపేటలో పర్యటించనున్నారు. వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే చెంచు సామూహిక వివాహా కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లను చేపట్టామని అధికారులు వెల్లడించారు. పట్టణంలోని చంద్రారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్లో సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని వనవాసి కళ్యాణ పరిషత్ రాష్ట్ర ప్రెసిడెంట్ కాట్రాజ్ వెంకటయ్య, జిల్లా అధ్యక్షుడు ఉడుతనూరు లింగయ్య, ఉపాధ్యక్షులు గట్టు అశోక్ రెడ్డి, మహిళా ప్రముఖ గుర్రం శంకులత తెలిపారు.