12-01-2026 01:23:14 AM
కరీంనగర్, జనవరి11 (విజయక్రాంతి): ఫిబ్రవరిలో పుర పాలిక ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. సంక్రాం తికి ముందు లేదంటే ఆ తర్వా త కచ్చితంగా షెడ్యూల్ ప్రకటించి ఆ వెనువెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రధాన పార్టీలు పుర పోరు పై దృష్టి సారించాయి. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయ డానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ను ఈ నెల 12న ప్రక టించనుంది.
15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రావా లంటే.. స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తి చేయాలి. అప్పుడే కేంద్రం గ్రాం ట్లు విడుదల చేసేం దుకు సాధ్యమవుతుంది. దాదాపు రూ.500 కోట్ల నిధులు రాకుండా ఆగి పోయిన నేపథ్యం లో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నగరపాలక సంస్థ, జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండిము న్సిపాలిటీలు ఉన్నాయి.పెద్దపల్లి జిల్లాలో రామగుండం నగరపాలక సంస్థ, పెద్ద పల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేముల వాడ మునిసిపా లిటీలు ఉన్నాయి.
రాష్ట్రం లో అత్యధిక మున్సిపాలిటీలుఉమ్మడి కరీంనగర్లో ఉన్నాయి. కరింనగర్ పార్లమెంట్ పరిధిలో సత్తా చాటాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ చూస్తున్నారు. ఈ మేరకు బి జె పి దూకుడు పెంచింది. సర్వే ఆధారంగానే టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. కలిసికట్టుగా ప్రచారం చేసి కరింనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేస్తామని బండి సంజయ్ ఇటివల సమావేశంలో స్పష్టం చేశారు. గడప గడపకూ వెళ్లి కేంద్రం చేసిన అభివ్రుద్దిని వివరించి ఓట్లు అడుగాలని సూచించారు.
టిక్కెట్ విషయంలో రాజీ ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చిచెప్పారు. మా కుటుంబ సభ్యులతో పైరవీ చేయిస్తే టిక్కెట్ కట్ అని, బీజేపీలో కుటుంబ సభ్యుల జోక్యం ఉండబోదనిగెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. సర్వే ఆధారంగానే టిక్కెట్లు ఇవ్వండి. మాకు టిక్కెట్ రాకపోయినా నారాజ్ కాబోం. రెబల్ గా పోటీ చేయబోం. కలిసికట్టుగా ప్రచారం చేసి కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేస్తాం” అంటూ కరీంనగర్ కార్పొరేషన్ కు చెందిన బీజేపీ నాయకులంతా ముక్తకంఠంతో సంజయ్ ఎదుట నినదించడం విశేషం.
పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు దక్కించుకొని ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు పట్టణాల దిశగా అడు గులు వేస్తోంది. ఇందుకుగాను గెలుపు గుర్రాల వేటలో పడ్డారు. ఆశావాహులు మాత్రం షెడ్యూల్ రాకముందే టికెట్ల వేటలో పడ్డారు. కాంగ్రెస్ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ అది శ్రీనివాస్ ల చుట్టూ ప్రదక్షిణలు చేసుతున్నారు.
.పంచాయతీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే.అదే సమయంలో బీఆర్‌ఎస్ సైతం గట్టిపోటీ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో బీఆర్‌ఎస్ ఓట్ బ్యాక్ చెక్కు చెదరలేదు అని ఈ ఎన్నికలతో నిరూపితం అయ్యింది. ఇదే క్రమంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని బీఆర్‌ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ల పై అధికారంలో ఉన్నసమయంలో జెండా ఎగరేసిన బి ఆర్ ఎస్ తిరిగి సత్తా చాటాలని చూస్తుంది.
వి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల తో పాటు ఉమ్మడి జిల్లాలో గెలుపు దిశగా వ్యూహం రచించ నున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంఐఎం పార్టీ అత్యధిక స్థానాలను గెలిచి సత్తా చాటాలని చూస్తుంది.. ముక్షంగా కరింనగర్ కార్పొరేషన్, జగిత్యాల మున్సిపాలిటీ ల పై దృష్టి సారించింది. ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ జాతీయ కార్యాలయం దారుసలాంలో దిశ నిర్దేశనం కూడా చేశారు.
ఎంఐఎం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ ఎంఐఎం అధ్యక్షుడు యూనుస్ నదీమ్ లతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఆయా పార్టీ లు ఎవరి వ్యూహాల్లో వారు ఉంటే ఆయా మున్సిపాలిటీ ల రీజర్వేషన్ లు తేలిన అనంతరం టికెట్ల వేట , పార్టీ ల మర్పిడిలు ఉపాండుకొనున్నాయి.