22-11-2025 06:26:28 PM
ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపీ 50వ పుట్టిన రోజు వేడుకలను మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి కుమార్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజా సమస్యల పట్ల నిరంతరం ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తున్న మా గోపన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, శంకర్, వెంకటేష్, మల్లేశం, మహేష్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.