calender_icon.png 7 October, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు చోరీకి పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం

07-10-2025 07:08:01 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్న ఈసీ తీరుపై రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంగళవారం ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమం కాజీపేట చౌరస్తాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యలు పాల్గొన్నారు. ఓటు చోరీ ఆపాలని కేంద్రానికి సంతకం చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఓటు చోరీ పై బూత్ స్థాయి, డివిజన్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు ఇంటింటికీ తిరిగి సంతకాలని సేకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు కోల్పోవడం అంటే సర్వం కోల్పోవడం అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గతంలో ఓట్లను అపహరించాయని, శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వ్యత్యాసం ఉందని చెప్పారు. ప్రజలందరు మాకెందుకు అనుకుంటే బీజేపీ ప్రభుత్వం, ఈసీతో కలిసి మన ఓట్లను చోరీ చేస్తున్నదని గుర్తు చేశారు.

గడిచిన చాలా కాలంగా రాహుల్ గాంధీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాల్పడిన ఓట్ల చోరీపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేస్తూ, మతపరమైన రాజకీయాలకు పాల్పడుతు, ఆర్ధిక సంక్షోభంలో దేశం ఉన్నప్పటికీ వారికి అధికార బదలాయింపు ఉంటుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం, ఈసీ సరైన సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మోసం చేస్తున్న బీజేపీ తీరును ప్రజలు ఖండిస్తున్నారు. ఓటు చోరీలు, ఈసీ పాక్షిక వైఖరికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ స్వరం కలిపి పోరాటం చేయాలి. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అణిచివేయాలని చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇవి శ్రీనివాస్ రావు, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, నేషనల్ కో ఆర్డినేటర్ పులి అనిల్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ జక్కుల రవి యాదవ్, విజయశ్రీ రాజాలి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.