06-07-2025 04:22:27 PM
కాగజ్ నగర్ (విజయక్రాంతి): తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని కాగజ్ నగర్ పట్టణంలోని నిత్య అన్నదాన కేంద్రంలో ఆదివారం శాకాంబరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పూలు, పండ్లు, కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Former MLA Koneru Konappa) ఆయన సతీమణి కోనేరు రమాదేవి, మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు ఆయన సతీమణి కోనేరు రుక్మిణి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా గోరింటాకు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.