20-12-2025 08:42:42 PM
నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ అర్బన్ బీజేపీ సీనియర్ నాయకుడు బట్టిగిరి ఆనంద్ (45) కన్నుమూశారు. శనివారం వేగువ జామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన నగరంలోని 7వ డివిజన్ శక్తి కేంద్రం ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
బీజేపీ నాయకుడి ఆకస్మిక మృతితో పార్టీలో విషాదఛాయలు నెలకొన్నాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అత్యంత సన్నితుడుగా అనుచరుడిగా ఉంటూ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఆనంద్ మృతి పట్ల ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తాతన విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆనంద్ మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు.