calender_icon.png 5 August, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ నాయకులకు బీసీ రిజర్వేషన్లపై పట్టింపు లేదు

05-08-2025 12:54:28 AM

ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ విమర్శ

రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 04(విజయక్రాంతి)కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై పట్టింపు లేకుండా పోయిందని ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం సిరిసిల్ల లో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ .కేంద్రంలోని బిజెపి పై సంచలన ఆరోపణలు చేశారు. గల్లీలో సై అంటున్న బిజెపి నేతలు ఢిల్లీలో నై అంటున్నారని మండిపడ్డారు.

బీసీ కమ్యూనిటీ కాకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రత్యేకంగా 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని అన్నారు. ఈ విషయంలో బిజెపి తన వైఖరి పై స్పష్టత ఇవ్వడం లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బిజెపి నాయకులు కేంద్రంలో మాత్రం బండి సంజయ్, కిషన్ రెడ్డిలు స్పందించడం లేదంటూ ఆరోపించారు.

బిసి రిజర్వేషన్ల పై కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. బీసీ రిజర్వేషన్లు అమలు కోసం ఢిల్లీలో ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులుపాల్గొన్నారు.