calender_icon.png 5 August, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణిలో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్

05-08-2025 12:51:57 AM

శేరిలింగంపల్లి, ఆగస్ట్ 4: తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం ఏ.రేవంత్ రెడ్డి దిశనిర్ధేశంలో అధికారులు అభివృద్ధి,సమస్యల పరిష్కారమే ద్యేయంగా ముందుకు సాగుతున్నారని  టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

సోమవారం  హాఫీజ్ పెట్ లో ఉన్న జలమండలి కార్యాలయంలో నిర్వహించిన  ప్రజావాణి కార్యక్రమంలో జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా  శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధి లో తమ దృష్టికి ప్రజలు తీసుకువచ్చిన మంజీర పైప్ లైన్  అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులపై జీఎం,డిజిఎం ఇతర అధికారులతో కలిసి సమీక్ష  నిర్వహించారు