calender_icon.png 6 October, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిషనర్ రమేష్ ను సన్మానించిన బీజేపీ నాయకులు

06-10-2025 05:41:56 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు గజభీంకర్ పవన్ ఆధ్వర్యములో సోమవారం నాయకులు మున్సిపాలిటీ కమిషనర్ రమేష్ కు శుభాకాంక్షలు తెలియజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ పండుగలు అయిన వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని విధాలుగా వసతులు కల్పించి పండుగలను విజయవంతంగా ఘనంగా నిర్వహించిన మున్సిపాల్ కమిషనర్ రమేష్ కి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో సుల్తానాబాద్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము తిరుపతి యాదవ్, జిల్లా కోశాధికారి కామని రాజేంద్రప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు ఎనగందుల సతీష్, పట్టణ కార్యదర్శి వేముల శ్రీనివాస్, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు పనుగట్ల శేఖర్ మాస్టర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.