calender_icon.png 6 October, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా తలసాని జన్మదిన వేడుకలు

06-10-2025 05:39:29 PM

సనత్‌నగర్ డివిజన్‌లో కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు..

సనత్‌నగర్ (విజయక్రాంతి): సనత్ నగర్ నియోజకవర్గ మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) జన్మదిన వేడుకలు అభిమానులు ఆత్మీయులు శ్రేయోభిలాషుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. సనత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్ రెడ్డి తలసాని జన్మదిన సందర్భంగా హనుమాన్ దేవస్థానంలో ఉన్న అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ముందుగా మా జనహృదయ నేత పేదల పాలిట పెన్నిధి పేదల ఆశాజ్యోతి అన్నా అంటే నేనున్నానంటూ పలికే మాజీమంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి కూడా ఎమ్మెల్యే తలసానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన అలుపెరుగని ప్రజా నాయకుడని 365 రోజులు సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ కాలనీలు బస్తీలు స్థితిగతులు చూసి ఎప్పటికప్పుడు ఆ సమస్యను వెంటనే పరిష్కరించే ఒక గొప్ప వ్యక్తి అని సనత్ నగర్ నియోజకవర్గంలో ఎన్నో వందల కోట్ల అభివృద్ధి పనులు చేసిన ఏకైక నాయకులు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న ఒక్కరే అని ఆయన కుటుంబం దుర్గామాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో కలకాలం చల్లగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొలను బాల్ రెడ్డి, బిఎస్ సీనియర్ నాయకులు కరుణాకర్ రెడ్డి, రామ్ నివాస్ బన్సాల్, పీయూష్ గుప్తా, మల్లేష్ యాదవ్, పురుషోత్తం, రవికుమార్, ఆర్బి మహేష్, పలారం బండి మధు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.