calender_icon.png 6 September, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందకృష్ణ మాదిగను సన్మానించిన బిజెపి నాయకులు

06-09-2025 05:04:38 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగను శనివారం తాండూర్ సుమంగళి ఫంక్షన్ హాల్ లో బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. పెన్షన్ దారులకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న మహా ధర్నా సన్నాహక సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను బిజెపి నాయకులు సత్కరించారు. అనంతరం మందకృష్ణ మాదిగ బెల్లంపల్లి చేరుకొని కన్నాల లోని టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతర స్వామి నివాసంలో ఎమ్మార్పీఎస్ నాయకులతో సమావేశమై జైపూర్ లో నిర్వహించే సన్నాహక సమావేశానికి బయలుదేరి వెళ్లారు.