06-09-2025 05:08:37 PM
అనంతగిరి: మండల పరిధిలో అమీనాబాద్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు రెచ్చిపోయారు త్రాగునీటి పైపులైన్లను రాళ్లతో ధ్వంసం చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ శుక్రవారం సెలవదినం కావడంతో కొందరు గుర్తుతెలియని ఆకతాయిలు పాఠశాలలో ప్రాంగణంలో ప్రవేశించి పిల్లల త్రాగునీటి అవసరాల కొరకు నిర్మించిన పైపులైను ధ్వంసం చేశారని అన్నారు.
గత మూడు నెలల వ్యవధిలో పాఠశాల ప్రాంగణంలో మద్యం సీసాలు వేసి పాఠశాల ప్రాంగణంలో చికాకు చేస్తున్నారని తెలిపారు. ఈరోజు ఉదయం పాఠశాలకు వచ్చేసరికి త్రాగునీటి పైప్లైన్లు కలిగి ఉన్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాపోతున్నారు. పాఠశాలలో భద్రతను మరింతగా బలోపేతం చేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు మండల విద్యాధికారిని కోరారు.ఇలాంటి వాటికి పాల్పడుతున్న వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.