11-10-2025 05:17:09 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ ను కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి శనివారం కరీంనగర్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని తాజా పరిస్థితులు, కనగర్తి గ్రామంలో పలు అంశాలపై చర్చించగా కేంద్రమంత్రి బండి సంజయ్ సానుకూలంగా స్పందించినట్లు పవన్ రెడ్డి తెలిపారు. అనంతరం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలంలో అత్యధిక స్థానాల్లో గెలిచి బీజేపీ సత్తా చాటాలని బండి సంజయ్ సూచించినట్లు ఆయన తెలిపారు.