11-10-2025 08:38:30 PM
మొదటి బహుమతి 30,000 అందజేసిన లూబి మోటార్స్..
పినపాక (విజయక్రాంతి): పినపాక మండలం తోగూడెం గ్రామపంచాయతీ గోపాలరావుపేట గ్రామంలో దసరా, దీపావళి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ రంగాపూర్, కాటాపూర్ జట్ల హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీలో విజేతగా రంగాపూర్ జట్టు నిలిచింది. విజేతలకు మొదటి బహుమతి 30 వేల రూపాయలు, షీల్డ్ లూబి మోటార్స్ సంస్థ నుండి అందజేశారు. రన్నర్ గా నిలిచిన జట్టుకు డీజే సతీష్ జ్ఞాపకార్థం అతని స్నేహితులు 20,000 అందించారు. గోపాలరావుపేట గ్రామానికి చెందిన నాయకులు బుసి శ్రీను, సత్యనారాయణ, సాంబశివరావు, నరసింహారావు, రామచంద్రు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బిల్లా నాగేందర్, సంతోష్,అశోక్, కోటి, దిలీప్, బృహస్పతి, నాగ మల్లేష్, సుధాకర్ రెడ్డి, శ్రీరామ్ నివేదన్, తదితరులు పాల్గొన్నారు.