calender_icon.png 12 October, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవిన్యూ అధికారుల దాడులు..

11-10-2025 08:50:40 PM

ఆరు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత..

మణుగూరు (విజయక్రాంతి): మండల పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తాహసిల్దార్ అద్దంకి నరేష్ హెచ్చరించారు. శనివారం అనంతారం నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ఇసుక ట్రాక్టర్లను తాహసిల్దార్ నరేష్ పట్టుకుని కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ.. గ్రామాలలో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులు తప్పనిసరిగా తాహసిల్దార్ కార్యాలయంలో ఇసుక అనుమతి పొందాలని సూచించారు. ట్రాక్టర్ యజమానులు అనుమతులు లేకుండా ఇసుకను తరలించడం గానీ, నిల్వ చేయడం గానీ చేస్తే కఠినంగా వ్యవ హరించబడుతుందని స్పష్టం చేశారు. ఇసుక రవాణాలో ఎవరైనా అక్రమ చర్యలకు పాల్పడితే, సంబంధిత వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్ఐ గోపి. డిటి రామారావు పాల్గొన్నారు.