calender_icon.png 11 October, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు

11-10-2025 05:20:52 PM

ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి..

జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభమైన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, పతక ప్రారంభోత్సవానికి శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై వీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పల్ల మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన. ఈ పథకాలు రైతులకు ఎటువంటి ఉపయోగం లేవని అన్నారు. కొత్తగా ఏ పథకం ఉన్న పథకాలకు, నిధులు కలిపి చూపిస్తున్నారని విమర్శించారు. ఈ పథకానికి 24 వేల కోట్ల రూపాయలు, కేటాయింపు ఉందని చెప్తున్నారు. కానీ అది కొత్తగా కేటాయించింది కాదు అని అన్నారు.

ప్రధానమంత్రి కిసాన్ యోజన పేరుతో ఇప్పటివరకు 3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారని, కేంద్రం చెబుతున్న రైతుల, జీవితాల్లో మార్పు మాత్రం రాలేదు అన్నారు. ఒక తెలంగాణ మాత్రమే దేశంలో రైతు కోసం రైతు బంధు, పథకం ప్రకటించిందని. 72 లక్షల మంది, రైతులు ఖాతాలకు నేరుగా జమ చేసిందని, ఆ ఘనత మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకీ దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ ఘనత అని గర్వంగా చెప్తున్న అన్నారు. రైతు సంక్షేమం అంటే మాటల్లో.. కాదు చేతుల్లో చూపించే నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల రైతుల, అభివృద్ధికై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.