calender_icon.png 12 October, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బరితెగించిన ఇసుక మాఫియా..

11-10-2025 08:48:04 PM

ట్రాక్టర్ తో పోలీసులను ఢీకొట్టే యత్నం..

తాండూరు (విజయక్రాంతి): అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను అడ్డుకోబోయిన పోలీసులపై ట్రాక్టర్ తో ఢీకొట్టేందుకు డ్రైవర్ యత్నించిన ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి జరిగింది. ఎస్సై నుమాన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని దామరచెడు గ్రామ శివారు నుండి దత్త రాత్రి బాలకృష్ణ అనే వ్యక్తి ఇసుక ట్రాక్టర్ తో వెళుతుండగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు అశోక్, రమేష్ ట్రాక్టర్ను అడ్డుకొని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా పోలీసులను ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో భయాందోళనలకు గురైన పోలీసులు వెంటనే తేరుకొని అడ్డుకున్నారు. కానిస్టేబుళ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ బాలకృష్ణపై ఇసుక అక్రమ రవాణా, పోలీసులను భయాందోళనలకు గురిచేసి విధులకు ఆటంకం కలిగించిన మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.