11-10-2025 08:42:01 PM
సిపిఎం సీనియర్ నాయకులు రణపంగ కృష్ణ..
పెన్ పహాడ్: మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన ప్రజా కళాకారుడు ఎర్రజెండ ముద్దుబిడ్డ వల్దాస్ లింగయ్య(56) శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ మేరకు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రణపంగ కృష్ణ విచ్చేసి.. మృతుడు లింగయ్య పార్థివదేహంపై ఎర్రజెండా కప్పి, పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ... మృతుడు లింగయ్య చిన్నతనం నుండే ఎర్రజెండా చేతబట్టి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలను చైతన్య చేయడం కోసం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఆట -పాటల ద్వారా ప్రజలను మేల్కొల్పి ప్రజా ఉద్యమాలు నిర్వహించరన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఎర్రజెండా పక్షాన ప్రజా పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి నెమ్మాది లక్ష్మి, మండల కమిటీ సభ్యుడు రణపంగ బుచ్చి రాములు, శాఖ కార్యదర్శి మోదుగు రవీందర్ రెడ్డి, నెమ్మది లింగయ్య, వల్దాస్ సైదులు నెమ్మది రాధాకృష్ణ, వెంకయ్య, సోమయ్య, శ్రీకాంతు తదితరులు ఉన్నారు.