11-10-2025 08:34:08 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం ఐద్వా అఖిల భారత మహాసభలు జనవరిలో హైదరాబాద్ లో జరగనున్నాయని ఈ మహాసభల జయప్రదంకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఐద్వా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి జ్యోతి పిలుపునిచ్చారు. ఐద్వా ఇల్లందు మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షురాలు ఎం. లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంను ఉద్దేశించి వారు మాట్లాడుతూ మనువాద మైకంలో పడి దేశంలో సనాతన దర్మం పేరు చెప్పుకుంటూ మహిళలపై, విద్యార్థినులపై, చిన్న పిల్లలపై అఘాత్యాలు, దాడులు, అరత్యాచారాలు జరుగుతున్న గాని పట్టించుకోవడం లేదని అన్నారు.
దేశ వ్యాప్తంగా మహిళల హక్కుల కోసం మహిళా చట్టాలు పక్కడబంధిగా అమలు చేయాలనీ ఆందోళనలు, పోరాటాలు జరుగుతున్నయని ఐద్వా ఆధ్వర్యంలో ఈ పోరాటాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఈ పోరాటాలను ముందుకు తీసుకవెళ్లడం కోసం ఐద్వా అఖిల భారత మహాసభలు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వేదిక కానుంనదని ఈ మహాసభల జయప్రదంకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఐద్వా మండల కార్యదర్శి ఆలేటి సంధ్య, అధ్యక్షులు ఎం. లక్ష్మి, వెంకటమ్మ, పి. లక్ష్మి, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.