calender_icon.png 23 August, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంపుకు గురైన పంటపై చర్యలు చూపండి

23-08-2025 06:29:54 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): గత ప్రభుత్వ పాలనలో ఎన్నడూ యూరియా కొడతా రాలేదని ప్రజా ప్రభుత్వంలో మాత్రం రైతులకు యూరియా కొరత విపరీతంగా కొనసాగుతుందని స్థానిక ప్రజలకు గత వారం రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు తీవ్ర పంట నష్టం జరిగిందని పంట నష్టం జరిగిన రైతులకు కనీసం వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా సంబంధిత శాఖ అధికారుల ద్వారా సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించాలని ఎల్లారెడ్డి ఆర్డిఓకు ఎల్లారెడ్డి మండల భారతీయ జనతా పార్టీ నాయకులు మండల అధ్యక్షులు నర్సింలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బత్తిని దేవేందర్ పలువురు బిజెపి నాయకులు ఆర్డీవోకు నేరుగా వినతిపత్రం అందజేసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. 

గత పది రోజుల క్రితం భారీగా కురిసిన వర్షానికి ఎగవ నా సింగూర్ నుండి మరియు పసుపు యేరు, హల్ది వాగు ఘనపూర్ పోచారం ప్రాజెక్టు నుండి అధికంగా భారీ వరద వచ్చి ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాల్లో ఉన్న సుమారు 20 గ్రామాలకు చెందిన రైతుల పంటలు అత్యధిక స్థాయిలో ముంపుకు గురై మునిగిపోయాయి. కనీసం రైతులను పట్టించుకోని ప్రభుత్వం రైతులకు కొంత మేరకు ఆర్థిక సహాయం అందే విధంగా చర్యలు చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం పోచారం ప్రాజెక్టు నీరు ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాలకు వరప్రసాద్ అని నాగిరెడ్డిపేట మండలం నుండి కెనాల్ ద్వారా నీటిని ఆయకట్టు చివరి డిస్ట్రిబ్యూటర్ వరకు కాలువలో ఉన్న చెత్తను తొలగించి నీటిని సక్రమంగా సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.

అలాగే గ్రామాలలో ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో కుక్కల బెడద విపరీతంగా ఉందని కోతులతో కూడా ప్రజలకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని రోజుకు కనీసం ప్రభుత్వ ఆసుపత్రికి కుక్కలు, కోతులు తరవడంతో ప్రభుత్వ ఆసుపత్రి ఎల్లారెడ్డికి రోజు పదుల సంఖ్యలో ఇంజక్షన్లు ఇప్పించుకోవడానికి ప్రజలు వస్తున్నారని కనీసం అధికారులు నాయకులు గమనించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని భాజపా నాయకులు వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంలో ఆ జాప్యం జరుగుతుందని త్వరితగతిన వంద పడకల ఆసుపత్రిని పూర్తిగా నిర్మాణం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో తెలిపారు.

విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన భోజనం అందించే విధంగా నాయకులు అధికారులు పర్యవేక్షణ చేసి మెనూ ప్రకారం భోజనం అందించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామపంచాయతీలో ప్రత్యేక అధికారుల పరిపాలనలో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుందని గ్రామంలోని వీధుల గుండా చెత్త  ముళ్ల పొదలు విపరీతంగా ఉన్నాయని కనీసం గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులు పర్యటించి ప్రజలను రక్షించే విధంగా చర్యలు చేపట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. రైతులు పండించిన సన్న వడ్లకు రూ.500 బోనస్ అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి శాఖ వారు పేర్కొన్నారు.