calender_icon.png 23 August, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

23-08-2025 06:31:33 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నగునూర్ లో ఈ రోజు హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో  "మన గణపతి మట్టి గణపతే" అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్ ను పాఠశాల ఇంచార్జ్ హెచ్ ఎం తిరుపతిరావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసినటువంటి విగ్రహాలను నెలకొల్పి వాటిని నీటిలో నిమర్జనం చేసినప్పుడు జరిగేటువంటి అనర్థాలను విద్యార్థులందరికీ వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి అని, అందుకోసం మనమందరం కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాలని పూజించాలని కొనియాడారు. తదుపరి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ధనపురి సాగర్ మాట్లాడుతూ, మా సంస్థ పక్షాన వినాయక చవితి పండుగ రోజు 200 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని దీనిని భక్తులు వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదన్, మల్లేశం, అదయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు.