23-08-2025 08:56:10 PM
కొండాపూర్ (విజయక్రాంతి): టిప్పర్ బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం గుంతపల్లి శివారులో జరిగింది. సంఘటన వివరాలు మీడియాతో ఎస్సై సోమేశ్వరి(SI Someswari) వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... కొండాపూర్ మండల పరిధిలోని గుంతపల్లి గ్రామానికి చెందిన కె. రాములు(50) గ్రామ శివారులో ఉన్న తన పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో గుంతపల్లి గ్రామ శివారులో తను నడుపుతున్న ఫ్యాషన్ ప్లస్ మోటార్ సైకిల్ నంబర్ టిజి 07 ఎఫ్ 1873 ను ఎదురుగా వస్తున్న టిప్పర్ నెంబర్ టీఎస్ 12 యూడి 3685 గల దాని డ్రైవర్ తన టిప్పర్ ను అతివేగంగా, అజాగ్రత్తతో నడుపుకుంటూ రాములు యొక్క మోటార్ సైకిల్ ను ఢీకొన్నారు. వాహనదారుడు రాములు అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. ఈ విషయము తన కొడుకు అయినా కొత్తగొల్ల మహేందర్ తెలుసుకొని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తెలిపారు.